ఉత్సవ ఏర్పాట్లలో… ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దు

ఉత్సవ ఏర్పాట్లలో… ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దు

నాచగిరి,ఆంధ్రప్రభ: ప్రసిద్ధ నాచగిరి వార్షిక బ్రహ్మోత్సవాలను సమిష్టిగా శ్రమించి విజయవంతం చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ హన్మంత రావు పేర్కొన్నారు. సోమవారం ఆలయ కార్యనిర్వహణ అధికారి రంగాచారి ఆధ్వర్యంలో వారికి ఉత్సవ ఆహ్వాన పత్రిక, స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయ బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నందున యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు కృష్ణమాచార్యులు, జగన్నాథచార్యులు, గోపాలకృష్ణ శర్మ, సహాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply