అరెస్టులు ఎంత వరకు సమంజసం..?

అరెస్టులు ఎంత వరకు సమంజసం..?

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హరిత రిసార్ట్ కు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ పట్టణంలో వామపక్షాల నాయకులను దారులు మండలం కెరలి గ్రామంలో మహాజన పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది పిల్లికల్ ఆనంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందుల గురిచేస్తుంది. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బందులు పెట్టడమే ప్రజా పాలనా..? అని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply