బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి…
బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి…
భాస్కర్ యాదవ్ డిమాండ్…
మేడ్చల్‌లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో బండి సంజయ్, భగీరథ్ దిష్టిబొమ్మల దహనం…..
మేడ్చల్, ఆంధ్రప్రభ : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్ డివిజన్ అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్ నాయకులతో కలిసి బండి సంజయ్, భగీరథ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ ఘాటు విమర్శలు చేశారు. నిందితుడిని కాపాడటం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటని, తక్షణమే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆయన విమర్శించారు. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారని గుర్తు చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ నాయక్, కౌన్సిలర్ సద్ది నిషిత రెడ్డి,చీర్ల దయానంద్ యాదవ్, మద్దుల శ్రీనివాసరెడ్డి, ఆకిటి నవీన్ రెడ్డి , విష్ణు చారి, గోపాల్ రెడ్డి, గణేష్, నడిగొప్పు నాగరాజు,స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
