Twitter | ఇరాన్ కఠిన నిర్ణయం…

Twitter | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఈ మధ్యకాలంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిలిటరీ దాడులు తీవ్రతరంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో, ఇరాన్ తన సమాధాన చర్యలు తీసుకుంటూ అమెరికాతో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేసింది.
ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ, ఇరాన్ జాతీయ భద్రతపై ట్విట్టర్‌లో వెల్లడించారు. “అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, తప్పుడు ఆశలతో ఈ ప్రాంతాన్ని సంక్షోభం వైపుకు నెట్టారని” అన్నారు. ఈ పరిణామాలు, ప్రస్తుతం అమెరికా దళాలకు మరింత ప్రాణ నష్టం కలిగే అవకాశముందని కూడా లరిజానీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య అణచివేత, రక్షణ చర్యలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన ఒక ప్రధాన సమస్యగా మారింది.
