వరాహ స్వామిని వెలికి తీసిన వానరం

వరాహ స్వామిని వెలికి తీసిన వానరం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్ గడ్డపై ఆధ్యాత్మిక సంబరం! 200 ఏళ్ల చరిత్ర కలిగిన నరసింహస్వామి గుహలో పురాతన వారాహ స్వామి విగ్రహం ప్రత్యక్షమైంది. అభివృద్ధి పనుల్లో భాగంగా వెలుగుచూసిన ఈ అద్భుత దృశ్యం భక్తుల్లో భక్తిభావాలను నింపింది.యుగయుగాల నాటి దైవ సాన్నిధ్యం దొరకడం స్థానికులకు దైవకృపగా మారింది.
స్వామి వారి ఆగమనం ముచ్కూర్ గ్రామానికి కొత్త కళను, ఆధ్యాత్మిక వైభవాన్ని తెచ్చింది. ఇది భక్తుల పాలిట శుభసూచకం!గుట్టపై తవ్వకాల్లో నెల రోజులుగా ఎవరికి కనిపించని విగ్రహం గుహలో తిరిగే కోతులవల్ల జారి కింద పడడంతో వెలుగులోకి వచ్చింది. వానరం ద్వారా దైవ విగ్రహం వెలుగు చూడటం పట్ల గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయం రజాకార్ల కాలం నాటిదని, తవ్వకాల్లో గుడి ఆనవాళ్లు బయట పడుతున్నాయని వారు తెలిపారు.

