సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచుతాయి

తిరువూరు, ఆధ్రప్రభ : పాఠశాలల్లో తరచు సైన్సు ప్రదర్శనలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందుతుందని జిల్లా సైన్స్ అధికారి విచ్చేశ్వరరావు అన్నారు. స్థానిక శ్రీనిధి టెక్నో స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు.
శ్రీనిధి స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను తిలకించిన ఆయన విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్స్, సోలార్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ, అంతరిక్ష విజ్ఞానంపై చేసిన ప్రయోగాలను ప్రశంసించారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కే గిరిబాబు, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ చెన్నారెడ్డి డాక్టర్ మధుకీర్తి స్కూల్ చైర్మన్ సురేష్ బాబు కరస్పాండెంట్ కిషోర్ బాబు డైరెక్టర్ మహేష్ ప్రిన్సిపాల్ వెంకటనారాయణ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
