ఉచిత కంటి పరీక్షల శిబిరం..

ఉచిత కంటి పరీక్షల శిబిరం..
కాలనీవాసులకు కంటి పరీక్షలు చేస్తున్న వైద్యురాలు
కాలనీ వాసులకు ఉచిత మందుల పంపిణీ..
25 వ వార్డు కౌన్సిలర్ పొనకంటి మేఘన శ్రీనివాస్
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 25వ వార్డు కార్ల్ మార్క్స్ కాలనీలో ఆదివారం ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర పిల్లల, కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో డాక్టర్ కేశిరెడ్డి అలేఖ్య కాలనీ వాసులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. 25వ వార్డ్ కౌన్సిలర్ పొనకంటి మేఘన శ్రీనివాస్ పర్యవేక్షణలో శిబిరం సజావుగా సాగింది. కాలనీవాసులందరికీ సమగ్రంగా కంటి పరీక్షలు చేయించి, సమస్యలు ఉన్న వారికి తగిన వైద్య సూచనలు అందించారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి శిబిరాలను తరచుగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న కాలనీవాసులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
