నూతన కమిషనర్ గా శ్రీనివాసరావు

నూతన కమిషనర్ గా శ్రీనివాసరావు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి మున్సిపల్ నూతన కమిషనర్ గా బి.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరావు ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి కొండపల్లి మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వస్తున్నారు.

ఇక్కడ విజయవాడ జోనల్ – 1 కమిషనర్ బి.రమ్యకీర్తన డిప్యుటేషన్ పై కొండపల్లి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తుండగా గత ఏడాది నవంబర్ 24న డిప్యుటేషన్ ను రద్దు చేయడంతో రిలీవ్ అయ్యారు. ఆమె స్థానంలో నవంబర్ 25న ఇక్కడ మేనేజర్ గా పనిచేస్తున్న వెంకటరత్నం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. రెండు నెలలు తరువాత పూర్తిస్థాయిలో నూతన కమిషనర్ ను నియమించారు. ఈయన ఈ నెల 2న (సోమవారం) బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది.

Leave a Reply