ఎమ్మెల్యేతో సర్పంచుల భేటీ. ఎందుకో తెలుసా..?

ఎమ్మెల్యేతో సర్పంచుల భేటీ. ఎందుకో తెలుసా..?

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీలకు చెందిన సమస్యల పై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఆయన నివాసంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. డ్రైనేజీ సమస్యలు, విధి లైట్ల సమస్యలు, సిసి రోడ్డు సమస్యలు, కరెంట్ సమస్యలు, మహిళా భవనాలు మంజూరు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణాలు, ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు గురించి తెలియజేశారు.

ఈ సమావేశంలో రాధానగర్ తండ సర్పంచ్ లక్ష్మి శ్రీరామ్ నాయక్, కడిలబాయితండా సర్పంచ్ లక్ష్మి సాగర్ నాయక్, తుంబావి తండ సర్పంచ్ జగన్ నాయక్, వాచ్యతండ సర్పంచ్ సుధాకర్ నాయక్, కడపగండి తండ సర్పంచ్ రాము నాయక్, రచకొండ సర్పంచ్ కవిత రఘు నాయక్, మర్రిబావి తండ సర్పంచ్ కిషన్ నాయక్, గంగమూలతండ సర్పంచ్ లచ్చు నాయక్ పాల్గొన్నారు.

Leave a Reply