సచివాలయంలో ఎంపీడీవో తనిఖీ

సచివాలయంలో ఎంపీడీవో తనిఖీ

శావల్యాపురం, ఆంధ్రప్రభ : శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో సీతారామయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ రికార్డులు, అందుతున్న సేవలు, ఉద్యోగుల సమయపాలన, కార్యాలయ పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply