10 villages | సంత ప్రారంభించిన సర్పంచ్…

10 villages | సంత ప్రారంభించిన సర్పంచ్…

10 villages | బిచ్కుంద, ఆంధ్రప్రభ : పుల్కల్ గ్రామంలో వారంతం సంత సర్పంచ్ సంతోష్ పటేల్ ప్రారంభించారు. శనివారం రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు సౌకర్యార్థం కోసం వారాంతపు సొంత ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. బిచ్కుంద మండలంలోని మేజర్ పంచాయతీ పుల్కల్ వారాంతపు సంత ప్రారంభించడంతో సుమారు 10 గ్రామాల ప్రజలకు సౌకర్యం ఉంటుందని ప్రజల కోరిక మేరకు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

పుల్కల్ లో బ్యాంకు, జిల్లా పరిషత్ హై స్కూల్ తో పాటు రైతు సేవ సహకార సంఘం సొసైటీ ఉన్నాయని ప్రజల తాకిడి ఎక్కువగానే ఉంటుందని కూరగాయలు అధిక సంఖ్యలో విక్రయాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. వారాంతపు సంత కూరగాయల కోసం బిచ్కుంద, బాన్సువాడ, పిట్లం గ్రామీణ ప్రాంతాల్లో నుండి కూరగాయల కోసం వెళ్లవలసిన వచ్చేదని ఆయన పేర్కొన్నారు. సంతను పుల్కల్ గ్రామీణ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మిని బాయ్ తుకారం, గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ భూమిశెట్టి,వార్డు సభ్యులు నాగం శంకర్, ఎంజీఆర్, తుకారాం గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply