శాంతినికేతన్ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం..

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; టేకుమట్ల మండల కేంద్రంలోని శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్లో శ్రీ లక్ష్మీ నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ పి రజిత రెడ్డి (గైనకాలజిస్ట్) తెలిపారు. ఆదివారం రోజున ఉదయం 9 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించేటువంటి వైద్య శిబిరానికి అనుభవం కలిగిన వైద్య బృందం చే అన్ని రకాల రక్త పరీక్షలు ఈసీజీ కంటి పరీక్షలు దంత పరీక్షలు ఎముకలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి వారికి తగిన మందులు పంపిణీ చేస్తారని తెలియజేశారు ఈ సందర్భంగా పలు మండలాల్లోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
