గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలి..

మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలని ఎంపీడీవో గంగుల యుగేందర్ రెడ్డి అన్నారు.మండల కేంద్రంలోని రైతు వేదిక నందు గత ఐదు రోజులుగా వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న రెండవ విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది.ఈ సందర్భంగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు వార్డు సభ్యులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం శిక్షణ పొందిన 13 గ్రామ పంచాయతీలకు చెందిన 122 మంది వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మధు,పర్యవేక్షకులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply