గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

  • జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోడ్ హుస్సేన్ నాయక్

కడెం ( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; మండల కేంద్రమైన కడంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక ఉన్నత ఆశ్రమ బాలుర పాఠశాలను శుక్రవారం జాతీయ ఎస్టి కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సందర్శించి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల తో మాట్లాడి ఆశ్రమ పాఠశాలలో నేలకుని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాలలో మధ్యలో ఉన్న శిథిలవస్థకు పాఠశాల భవనమును తొలగించి పాఠశాలకు నూతన భవనం నిర్మాణం చేసి విద్యార్థుల కోసం పాఠశాల గ్రౌండ్ పెద్దగా ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే పాఠశాల తరగతులలో టైల్స్ ఏర్పాటు చేయాలని అలాగే పాఠశాలలో నూతన కిటికీలను ఏర్పాటు చేసి కోతులు లోపల రాకుండా జాలీలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల కోసం నూతనంగా మూత్రశాలలు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. విద్యార్థులకు పాఠశాల లో నాణ్యమైన విద్య బోధన అందిస్తూ ప్రభుత్వ మెనూ పాటిస్తూ నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలన్నారు.

పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమకు నేరుగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి తెలియజేయాలని ఆయన కోరారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డిటిడబ్ల్యూ ఓ అంబాజీ జాదవ్, పాఠశాల హెచ్ఎం వసంతరావు, హెచ్ డబ్ల్యు ఓ రాంజీ, బిజెపి గిరిజన మోర్చా జాతీయ నాయకులు జి శ్రీ రామ్ నాయక్, బిజెపి జిల్లా నాయకులు ఇస్లావత్ మోహన్ నాయక్, జక్కుల సత్తన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply