Tapsee | షాకింగ్ కామెంట్స్..

Tapsee | షాకింగ్ కామెంట్స్..
Tapsee | తెలుగు సినిమాలపై తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు
గ్లామర్ వ్యాఖ్యలతో మళ్లీ వైరల్
నెట్టిజన్ల ఆగ్రహం
యుటర్న్ తీసుకున్న తాప్సీ
తెలుగు సినిమాల వలననే గుర్తింపు అంటూ వ్యాఖ్య
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు.. కొంత మంది ప్రవర్తిస్తుంటారు. అలాంటి వాళ్లల్లో హీరోయిన్ తాప్సీ ముందుంటుందని చెప్పచ్చు. తెలుగు సినిమా ఝుమ్మంది నాదం సినిమాతో కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆతర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సౌత్ సినిమాల గురించి.. ముఖ్యంగా తెలుగు సినిమాల గురించి తక్కువగా మాట్లాడుతుంటుంది. ఆమధ్య ఇలాగే మాట్లాడింది. ఇప్పుడు మరోసారి ఈ అమ్మడు అలాగే మాట్లాడిందని వార్తలు వస్తున్నాయి. అసలు తాప్సీ ఏమని కామెంట్ చేసింది..? ఇప్పుడు ఏమని మాట మార్చింది..?
Tapsee | కథలో అవసరం లేకపోయినా..

తాప్సీ ఆమధ్య తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ.. గ్లామర్ ఎక్కువ చూపించాలి అనుకుంటారని.. ముఖ్యంగా బొడ్డు పై పళ్లు వేస్తారంటూ ఏకంగా దర్శకేంద్రుడినే టార్గెట్ చేసింది. ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అప్పుడు సోషల్ మీడియా ద్వారా సారీ కూడా చెప్పింది. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో సౌత్ సినిమాలు, తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ.. కథలో అవసరం లేకపోయినా.. గ్లామర్ చూపించాలి అంటారు. బొడ్డు పై దృష్టిపెడుతారు. రెండు ఇంచులు కింద, రెండు ఇంచులు మీద అంటూ ఇబ్బంది పెడుతారు. వారికి ఆ పార్ట్ పై ఎందుకంత ఇంట్రెస్టో అర్ధం కాదు అంటూ తెలుగు సినిమాలను, దర్శకులను తక్కువ చేస్తూ మాట్లాడింది. ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
Tapsee | యుటర్న్ తీసుకున్న తాప్సీ..

తాప్సీ చేసిన కామెంట్స్ పై నెట్టిజన్లు ఫైర్ అవుతున్నారు. తెలుగు సినిమాల్లో నటించినప్పుడే చెప్పాల్సింది. అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు బాలీవుడ్ వెళ్లి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ అమ్మడు యుటర్న్ తీసుకుంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్ వ్యూలో.. తెలుగు సినిమాల వలనే తనకు ఆదరణ లభించిందని.. చెబుతుంది. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు బుజ్జగించడానికి అన్నట్టుగా తెలుగు సినిమా వలనే పేరు వచ్చింది.. తనలోని నటి బయటకు వచ్చింది.. అని కబుర్లు చెబుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. మనసులో ఏముందో ఒకసారి బయటపెట్టిన తర్వాత ఇప్పుడు మాట మారిస్తే మాత్రం నమ్ముతారు అనుకుంటే పొరపాటే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఇక నుంచైనా తాప్సీ ఆచితూచి మాట్లాడతాదేమో చూడాలి.
