ఆలేరు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఆలేరు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ఆలేరు, ఆంధ్రప్రభ: ఆలేరు పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవిలో దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా పోలీసులతో రాత్రి గస్తీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను ధరించడం తప్పనిసరి అని ఆయన తెలిపారు. ప్రమాదాలను నిలువరించడం కోసం హెల్మెట్ ధారణ పై ప్రజలకు ప్రత్యేక అవగాహనను కల్పించేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు.
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను ధరించడాన్ని విధిగా భావించాలని ఆయన సూచించారు. పోలీసు శాఖ తరపున రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నట్టు ఆయన వివరించారు.అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, ఏసిపి శ్రీనివాస్ నాయుడు ఎస్పీ వెంట ఉన్నారు.
