fraud13k | సమాచారాన్ని పోలీసులకు వెంటనే తెలపాలి…సిఐ నాగరాజు

fraud13k | సమాచారాన్ని పోలీసులకు వెంటనే తెలపాలి…సిఐ నాగరాజు

fraud13k | ఫోన్‌పే నకిలీ మెసేజ్‌తో రూ.13 వేల మోసం
వాహన తనిఖీల్లో పోలీసులపై దురుసు ప్రవర్తన
బస్టాండ్ వద్ద చిక్కిన నిందితుడు
ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక గాలింపు
ప్రజలకు పోలీసుల కీలక విజ్ఞప్తి

fraud13k | చిట్యాల, ఆంధ్రప్రభ : విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఆటంకం కల్గించి,వారి పట్ల దురుసుగా ప్రవర్తించి పారిపోయిన నిందితుల్లో ఒకరు అరెస్ట్ – బలెనో కారు స్వాధీనం. చేసుకున్నట్లు సిఐ నాగరాజు తెలిపారు. చిట్యాల పోలీస్ స్టేషన్లో బుధవారం నాడు విలేకరుల సమావేశంలో సీఐ నాగరాజు ఎస్సై తో కలిసి మాట్లాడారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కల్గించి, వారిపై దురుసుగా ప్రవర్తించి కారు వదిలి పారిపోయిన నలుగురు నిందితుల్లో ఒకరిని పట్టుకుకొని, నేరానికి ఉపయోగించిన బలెనో కారు నెంబర్: AP-40-FL-0512 ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

తేదీ 25-04-2026 నాడు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతంలోని SBI ATM వద్ద డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తికి మాయమాటలు చెప్పి, “మీకు నేను ఫోన్ పే చేస్తాను” అంటూ ఫ్రాంక్ పేమెంట్ యాప్ ద్వారా నకిలీ మెసేజ్ పంపించి, అతని వద్ద నుండి రూ.13,000/- నగదు తీసుకుని నిందితులు హైదరాబాద్ వైపు పారిపోయారు.

అదే సమయంలో చిట్యాల ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు అతి వేగంగా వెళ్తున్న బలెనో కారును ఆపడానికి ప్రయత్నించారు. అయితే, కారులో ఉన్న హేమసాయి, హరి, సురేష్, బాలు అనే నిందితులు పోలీసులకు సరైన సమాధానాలు ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించి, వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించకుండా పోలీసులను నెట్టివేసి అక్కడి నుంచి పారిపోయారు.

అనంతరం, బుధవారం చిట్యాల బస్టాండ్ వద్ద కారును వదిలి పారిపోయిన వ్యక్తుల్లో ఒకరు ఉన్నట్లు నమ్మదగిన సమాచారం అందడంతో, ఎస్‌ఐ రవి కుమార్ తమ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. విచారణలో అతని పేరు బుద్ధ హేమసాయి, తండ్రి పేరు దుర్గాప్రసాద్, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పట్టుబడిన నిందితుడితో పాటు మరో ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ప్రస్తుతం మిగిలిన నిందితులైన హరి, సురేష్, బాలు లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకోవడం ఒక తీవ్రమైన నేరమని, ఇటువంటి చర్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నార్కట్పల్లి, చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు హెచ్చరించారు.

fraud13k | పరారీలో ఉన్న నిందితులు:


1)).హరి, R/o అనకాపల్లి గ్రామం, మండలం & జిల్లా, ఆంధ్రప్రదేశ్. (Absconding)
2).సురేష్, R/o అనకాపల్లి గ్రామం, మండలం & జిల్లా, ఆంధ్రప్రదేశ్. (Absconding)
3).బాలు, R/o అనకాపల్లి గ్రామం, మండలం & జిల్లా, ఆంధ్రప్రదేశ్. (Absconding)

fraud13k | ప్రజలకు విజ్ఞప్తి:


చిట్యాల మండల పరిధిలోని ప్రజలు అసాంఘీక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు వెంటనే తెలియజేయాలని, చట్టాన్ని గౌరవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పోలీసులు కోరారు.

ఇట్టి ముఠా సభ్యులను పట్టుకునే ప్రక్రియలో ప్రతిభ కనబరిచిన చిట్యాల ఎస్‌ఐ రవి కుమార్, ఏఎస్ఐ-1920, పీసీలు ఆనంద్, మహేష్, వెంకన్నలను డీఎస్పీ నల్గొండ ప్రత్యేకంగా అభినందించారు.

fraud13k
fraud13k

click here to read more

click here to read ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ అధికారి