నీటి ఎద్దడీ లేకుండా ముందస్తు చర్యలు

నీటి ఎద్దడీ లేకుండా ముందస్తు చర్యలు
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభః రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఆదేశించారు. గురువారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక వాహనం యాప్ ద్వారా ఇసుక సరఫరా అయ్యేలా చూడాలన్నారు.
అభివృద్ధి వేగం చేసేందుకు గాను వంద శాతం పన్నులు వసూలు దిశగా కార్యదర్శులు పని చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పనులను గుర్తించి పనుల్లో వేగం పెంచాలని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలో వందమంది కూలీలకు పని కల్పించాలని ఆదేశించారు. నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాల మీద సిబ్బంది కి అవగాహన కల్పించారు. విధి నిర్వహణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశం లో ఎంపీవో జావీద్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.
