Kalyanram | బింబిసార 2 తెర వెనుక ఏం జరిగింది..?

Kalyanram | బింబిసార 2 తెర వెనుక ఏం జరిగింది..?

బింబిసార 2 ఎందుకు ఆగిపోయింది?
క్రియేటివ్ డిఫరెన్స్‌లే కారణమా?
కథతో అసంతృప్తి
సీక్వెల్స్ నందమూరి హీరోలకు కలిసి రాలేదా?
కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో నెక్ట్స్ మూవీ?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో మరచిపోలేని సినిమాల్లో ఒకటి బింబిసార. ఈ సినిమాతోనే మల్లిడి వశిష్ట్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన బింబిసార బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ టైమ్ లోనే బింబిసార 2 అనౌన్స్ చేశారు. అయితే.. ఇంత వరకు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు బింబిసార 2 వెనుక ఏం జరిగింది..? ఎందుకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయింది..?

Kalyanram | క్రియేటీవ్ డిఫరెన్స్..

Kalyanram

బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కళ్యాణ్‌ రామ్.. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తోనే ఈ సీక్వెల్ చేయాలి అనుకున్నారు. కథ రెడీ చేశారు. అయితే.. కథ విషయంలో కళ్యాణ్‌ రామ్, వశిష్ట్ ఇద్దరి మధ్య క్రియేటీవ్ డిఫరెన్స్ వచ్చాయట. అందుకనే ఈ ప్రాజెక్ట్ నుంచి వశిష్ట్ తప్పుకున్నారనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఆతర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత వశిష్ట్ విశ్వంభర మూవీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. బింబిసార 2 కథను కళ్యాణ్ రామ్.. డైరెక్టర్ అనిల్ పాడూరి చేతిలో పెట్టారు. ఆయన కథ పై చాలా రోజులు వర్క్ చేశారు.

Kalyanram | అసలు కారణం ఇదే..

Kalyanram

కళ్యాణ్‌ రామ్ హీరోగా అనిల్ పాడూరి డైరెక్షన్ లో.. బింబిసార 2 త్వరలో సెట్స్ పైకి వస్తుంది అనుకుంటే.. ఇంత వరకు పట్టాలెక్కలేదు. కారణం ఏంటంటే.. కథ విషయంలో కళ్యాణ్‌ రామ్ కి పూర్తి స్థాయిలో సంతృప్తి కలగలేదట. కొంత మంది రైటర్స్ తో వర్క్ చేయించినప్పటికీ.. అనుకున్న విధంగా రాకపోవడం వలన ఆ ప్రాజెక్ట్ పక్కనపెట్టేసారని టాక్ వినిపిస్తోంది. మరో వైపు ఈ సీక్వెల్ నందమూరి హీరోలకు కలిసి రాలేదు. బాలయ్య అఖండ 2 చేసారు. ఈ సినిమా రిజెల్ట్ గురించి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ వార్ 2 చేశారు. ఆ సినిమాకి ఎలాంటి ఫలితం వచ్చిందో చూశాం. ఇలా పార్ట్ 2 అనేది నందమూరి హీరోలకు కలిసి రాలేదనే కారణంగా ఆపేసారని కూడా ప్రచారం జరుగుతుంది.

Kalyanram | కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్..

Kalyanram

మరి.. కళ్యాణ్ రామ్ నెక్ట్స్ ఏంటి అంటే.. రైటర్ శ్రీకాంత్ విస్సాతో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. రైటర్ శ్రీకాంత్ విస్సా పుష్ప సినిమాతో పాటు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కి వర్క్ చేశాడు. అతను డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నాడు. కళ్యాణ్ రామ్ కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశాడని.. ఈ కథ ఓకే అయ్యిందని తెలిసింది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించేందుకు ప్లాన్ జరుగుతుందని.. త్వరలో అనౌన్స్ చేస్తారని టాక్. ఈమధ్య కాలంలో కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన సినిమాలు సరిగా ఆడలేదు. మరి.. ఈ సినిమాతో అయినా కళ్యాణ్‌ రామ్ మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

Leave a Reply