Accidentally | రక్షించిన అటవీ అధికారులు
Accidentally | రక్షించిన అటవీ అధికారులు
Accidentally | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గుజరాత్ రాష్ట్రంలో ఓ చిరుత బావిలో పడిపోవడం కలకలం రేపింది. ప్రమాదవశాత్తు బావిలో చిక్కుకున్న ఈ అడవి జంతువును అటవీశాఖ అధికారులు సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలను కాపాడారు.
గుజరాత్‌లోని పర్వాలా గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బావిలో చిరుత పడిపోయినట్లు స్థానికులు గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.చిరుత భయంతో అల్లాడుతూ బావిలో తిరుగుతుండగా, జాగ్రత్తగా చర్యలు చేపట్టిన అధికారులు దానికి ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించారు. అనంతరం తాడు సహాయంతో చిరుతను కట్టుకుని మెల్లగా పైకి లాగి బయటకు తీశారు. చిరుతను బయటకు తీసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి, అడవిలోకి వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ రక్షణ చర్యలకు స్థానికులు ప్రశంసలు కురిపించారు.

