Tipper | అర్ధరాత్రి యువకుడి పై దూసుకెళ్లిన వైనం…

Tipper | అర్ధరాత్రి యువకుడి పై దూసుకెళ్లిన వైనం…
Tipper | గూడూరు, ఆంధ్రప్రభ : రోడ్డుపై నడిచి వెళుతున్న యువకుడి పై టిప్పర్ లారీ దూసుకు వెళ్లిన సంఘటనలో ఆ యువకుడు అక్కడికక్కడే దుర్మార్గం పాలయ్యాడు. ఘటన స్థలానికి గూడూరు డిఎస్పి గీతా కుమారి, ఒకటో పట్టణ ఎస్సై మనోజ్ కుమార్ చేరుకొని పరిశీలించారు.
పోలీసుల వివరాల మేరకు సోమవారం రాత్రి పట్టణంలోని సాదుపేట వద్ద నుండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాల వైపు వెళుతున్న టిప్పర్ లారీ అటుగా నడుచుకుంటూ వెళుతున్న యువకుడి పై దూసుకెళ్తూ దాదాపు కొంతమేర ఆ యువకుడిని ఈడ్చుకొని వెళ్లి అతనిపై ఎక్కడంతో అతడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా భావిస్తున్నారు. వివరాలు తెలిసినవారు ఒకటవ పట్టణ పోలీసులకు సిఐ: 9490413803, ఎస్ఐ:9440796342 నెంబర్లను సంప్రదించి సమాచారం అందించాలని వెల్లడించారు.

