Shambala | ‘శంబాల’ పుత్రోత్సాహం అందించేనా..?

Shambala | ‘శంబాల’ పుత్రోత్సాహం అందించేనా..?

Shambala | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘శంబాల(Shambala)’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌(pre-release event)ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, తమన్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. ‘‘శంబాల’ మీద ముందు నుంచీ పాజిటివ్ వైబ్(positive vibe) ఉంది. యుగంధర్ ముని మంచి దర్శకుడు. శ్రీ చరణ్ పాకాల గారి ఆర్ఆర్, మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో ధర్మ కారెక్టర్ కోసం సాయి కుమార్ వద్దకు వెళ్లాను. ఆ టైంలో ఆయన మాకు చేసిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను.

ఇండస్ట్రీలో నాకు పరిచయమైన పెద్ద హీరో ఆయనే. సాయి కుమార్ వల్లే నా కెరీర్ బాగుందని అనుకుంటూ ఉంటాను. ఇండస్ట్రీ(industry)లోని ప్రతీ ఒక్కరి గురించి పాజిటివ్‌గానే మాట్లాడతారు. ప్రతీ ఒక్క సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఆది అన్న ‘ప్రేమ కావాలి’ సినిమా టైంకి నేను ఇంటర్‌లో ఉన్నాను.

హిట్లు కొట్టడం ఒకెత్తు అయితే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం మరో ఎత్తు అని ఆది అన్నని చూస్తే అర్థమైంది. ‘శంబాల’ గురించి పాజిటివ్ టాక్ వింటున్నాను. ఈసారి ఆది అన్నకి మంచి సక్సెస్ రావాలని అందరం కోరుకుంటున్నాం. డిసెంబర్ 25న ‘శంబాల’ని అందరూ చూడండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘‘శంబాల’ ట్రైలర్ బాగుంది. ఆదికి ఈ చిత్రంతో మంచి విజయం రావాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు.. మంచి చిత్రాల్ని ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. నిరంతరం కష్టపడుతూ ఉండే ఆదికి ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్(Blockbuster) రావాలి. యుగంధర్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది.

కథను నమ్మి ఇంత ఖర్చు పెట్టిన నిర్మాతలకు హ్యాట్సాఫ్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని థియేటర్లోనే అందరూ చూడండి’ అని అన్నారు.

ఆది సాయికుమార్ మాట్లాడుతూ .. గత ఏడాది డిసెంబర్‌లో ‘శంబాల’ ఫస్ట్ పోస్టర్‌(First Poster) నుంచి అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. టీజర్‌ను దుల్కర్ రిలీజ్ చేశారు. ప్రభాస్, నాని రిలీజ్ చేసిన ట్రైలర్‌లు అంచనాల్ని పెంచేశాయి. యుగంధర్ ముని అద్భుతంగా తీశాడు కాబట్టే ఈ రోజు చిత్రం పై హైప్ ఏర్పడింది.

Shambala |మా మూవీని చూసి సర్ ప్రైజ్ అవుతారు

దర్శక, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని రూపొందించారు. బడ్జెట్ ఎక్కువ అయినా కూడా నిర్మాతలు మహీధర్, రాజశేఖర్ వెనుకాడలేదు. ప్రవీణ్ విజువల్స్(Praveen Visuals), శ్రీచరణ్ ఆర్ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. ‘శంబాల’లో అందరూ అద్భుతంగా నటించారు. థియేటర్లో అందరూ మా మూవీని చూసి సర్ ప్రైజ్ అవుతారు. ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లో చూస్తేనే.. ఆ ఫీల్‌‌ను ఎంజాయ్ చేస్తారు. నాకు సినిమా తప్పా ఇంకో ప్రపంచం తెలీదు.

సాయి కుమార్ కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఆయన కొడుకుని అని చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీల్ అవుతాను. నేను హిట్టు కొట్టాలని ఆయన ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘శంబాల’తో మేం డిసెంబర్ 25న హిట్టు కొట్టబోతోన్నాం. క్రిస్మస్‌(Christmas)కి రిలీజ్ కాబోతోన్న అన్ని చిత్రాలు హిట్ అవ్వాల’ని అన్నారు.

సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘మా అమ్మానాన్నతో మొదలైన సినీ ప్రయాణం(Cinema Journey) ప్రేక్షకుల ఆదరణతో ఇంకా కొనసాగుతోంది. 1975లో నేను హీరోగా పరిచయం అయ్యాను. 2011లో ‘ప్రేమ కావాలి’తో హీరోగా పరిచయం అయ్యారు. జయాపజయాలు అందరికీ సహజమే. కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. ‘శంబాల’తో ఆదికి విజయం దక్కబోతోంది.

నిజంగానే.. మునిలా యుగంధర్ ఈ మూవీని రూపొందించారు. గత డిసెంబర్‌లో రిలీజ్ చేసిన పోస్టర్‌ నుంచి ఇప్పటి వరకు పాజిటివిటీ ఏర్పడుతూనే వచ్చింది. దుల్కర్, ప్రభాస్, నాని ఇలా అందరూ ‘శంబాల’కు సపోర్ట్ చేశారు. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్(Audience) ఆదరిస్తారు. కిరణ్ అబ్బవరం, అనిల్ రావిపూడి, ప్రియదర్శి ఇలా అందరూ నాకు ఫ్యామిలీ లాంటివారు.

జయాపజయాలతో సంబంధం లేకుండా మా కోసం నిలబడిన అభిమానులకు థాంక్స్. అభిమానుల పేరు, నా పేరుని ఈసారి ఆది నిలబెడతారు. మైత్రి శశి ఈ మూవీని చూసి హిట్ అవుతుందని చెప్పడంతో కాస్త ఉపశమనం కలిగించింది. ఓవర్సీస్‌(Overseas)లో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నారు. ‘శంబాల’ డిసెంబర్ 25న ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీంకు విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

CLICK HERE TO READ

Leave a Reply