బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్, ఉద్యోగులు…

బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్, ఉద్యోగులు…
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల నూతన తహసిల్దార్ కార్యాలయం ను సోమవారం ఆర్డిఓ వెలమ శేఖర్ రెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలలో ఉండడం వలన అద్దె కట్టడం భారంగా మారుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అద్దె భవనంలో కొనసాగుతున్న చౌటుప్పల్ మండల తహసిల్దార్ కార్యాలయం ను పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ ప్రక్కన ఉన్న టి ఎల్ కె విల్లాస్ నూతన ప్రభుత్వ భవనంలోకి మార్చడం జరిగింది.
మండల తహసిల్దార్ బి వీరాబాయి నూతన కార్యాలయంలో అర్చక స్వాముల ఆశీర్వాదంతో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో శేఖర్ రెడ్డి, తహసిల్దార్ వీరాబాయి లు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం, భూముల రిజిస్ట్రేషన్ ల కోసం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులు, ఇతరులు పాత కార్యాలయానికి వెళ్ళకుండా నూతనంగా ప్రారంభించిన తహసిల్దార్ కార్యాలయానికి రావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సిద్ధార్థ కుమార్ రెడ్డి, మండల రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ శర్మ, రెవెన్యూ గిర్దావర్లు బాణాల రామ్ రెడ్డి, కొప్పుల సుధాకర్ రావు తదితర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


