అంగన్వాడీ చిన్నారులకు కుర్చీలు వితరణ..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిఅవుసలోనిపల్లి 3వ అంగన్వాడీ కేంద్రానికి శనివారం దాతలు నాగరాజు అనిత దంపతులు బాల బాలికలకు కుర్చీలు వితరణ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ శ్రీలత మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తుందని దాతలు సహకరిస్తే కేంద్రాల్లో మరింత వసతులు చిన్నారులకు ఏర్పడతాయని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో చదువుతున్న చిన్నారి రాణా ప్రతాప్ పుట్టినరోజు పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు వితరణ చేశారని పేర్కొన్నారు. నేలపై కూర్చుని అక్షర జ్ఞానం నేరుస్తున్న చిన్నారులకు 15 కుర్చీలు వితరణ చేయడంతో చిన్నారులు కుర్చీలపై కూర్చుని చదువుకోవడం ఆనందంగా ఉందన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు దాతలు తమ వంతు సహకారం అంగన్వాడీ కేంద్రాలకు చేయాలనికోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply