ఊట్కూర్‌లో బందర్ దొడ్డి పనులు పునఃప్రారంభం

ఊట్కూర్‌లో బందర్ దొడ్డి పనులు పునఃప్రారంభం

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో గత కొన్ని కాలంగా నిరుపయోగంగా ఉన్న బందర్ దొడ్డిని తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు పనులు ప్రారంభించారు.

ఉపసర్పంచ్ ఆర్. రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం. భరత్ ఆదివారం ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా బందర్ దొడ్డి నిరుపయోగంగా ఉండడంతో శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. రైతుల పంటల రక్షణ, గ్రామ శాంతి దృష్ట్యా తిరిగి బందర్ దొడ్డిని వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. వానాకాలంలో రైతులు పంటలు సాగు చేస్తుండగా, పశువుల యజమానులు పశువులను వదిలేయడం వల్ల పంటలకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.

రైతుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. పశువుల యజమానులు తమ పశువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. పంటలకు నష్టం కలిగించే పశువులను అవసరమైతే బందర్ దొడ్డికి తరలించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తార కృష్ణ, బాలాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply