Forensic Lab | బూడిదైన 1100 కీలకమైన ఫైళ్లు

Forensic Lab | బూడిదైన 1100 కీలకమైన ఫైళ్లు

  • రికవరీ అసాధ్యం…

Forensic Lab | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవలే హైదరాబాద్ లోని నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాద ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 1100 కీలకమైన ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయని ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది.

ఈ ఘటనపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారులు ఈ డేటాను రికవరీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ కాలిపోయిన డేటాను తిరిగి పొందడం అసాధ్యమని బృందం స్పష్టం చేసింది. దగ్ధమైన ఫైల్‌లో అనేక క్రిమినల్ కేసులకు సంబంధించిన కీలక డేటా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా వీటిలో హత్యలు, అత్యాచారాలు, ఆర్థిక నేరాలు, డ్రగ్స్ వంటి అనేక సంచలనాత్మక క్రిమినల్ కేసులకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాలిబూడిదైన ఫైళ్లపై అధికారులు ఏం చేస్తారో చూడాలి మరి.

Forensic Lab |

Leave a Reply