jewellery|ప‌రుగు మొద‌లెట్టిన ప‌సిడి

jewellery|ప‌రుగు మొద‌లెట్టిన ప‌సిడి

  • రెండు రోజులుగా ధ‌ర‌లు పైపైకి..
  • కొనుగోలుదారుల్లో ఆందోళ‌న‌
  • సిల్వ‌ర్ రేట్ల‌లో నో ఛేంజెస్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఇలాంటి స‌మ‌యంలో సాధారణంగానే బంగారానికి గిరాకీ ఎక్కువ‌గా ఉంటుంది. పెళ్లివారంతా జ్యువెలరీ షాపుల‌కు ప‌రుగులు పెడుతున్నారు. కానీ పెరుగుతున్న గోల్డ్ రేట్లు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. గత రెండు రోజులు త‌గ్గిన ధ‌ర‌లు మళ్లీ ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాయి.

మొన్నటి వరకు నేలచూపులు చేసిన గోల్డ్ రేట్లు వరుసగా రెండు రోజూ పెరిగింది. ఫిబ్రవరి 19న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 2,100 పెరిగితే.. శనివారం మరో రూ. 880 పెరిగింది. దాంతో బంగారం ధరలు మరోసారి కొండెక్కి కూర్చొన్నాయి. ఇక వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు.

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ వారం మధ్యలో కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రాములు) ధర రూ.1,57,380 వద్ద స్థిరపడింది.

ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,44,260గా ఉంది. శుక్రవారంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారంపై రూ.880, 22 క్యారెట్లపై రూ.800 మేర పెరిగింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,520 ఉండగా, ముంబైలో రూ.1,57,370, చెన్నైలో రూ.1,57,300గా నమోదైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు వెండి రేటు ఏ మార్పు లేకుండా రూ. 2,70,000 మార్క్ వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.

Leave a Reply