యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలి

యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలి

  • జిల్లా కలెక్టర్ కు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి లేఖ..

నిజామాబాద్, ఆంధ్రప్రభ : యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని. యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో రైతులందరికీ ఎరు వులు పంపిణీ చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి జిల్లా కలెక్టర్ ని కోరారు. శుక్రవారం ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు దినేష్ పటేల్ కులాచారి లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లా డారు. జిల్లా వ్యాప్తంగా (ము ఖ్యంగా బోధన్, ఆర్మూర్, బాల్కొండ, ఇం దూర్ రూరల్, బాన్సు వాడ) రైతులు ప్రస్తుతం తీవ్రమైన యూరియా కొరతను ఎదుర్కొంటు న్నారనీ వాపోయారు.

నాట్లు వేసి నెలలు గడుస్తు న్నా సకాలంలో యూరి యా అందక పంటలు దెబ్బతింటున్నాయన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయి, అప్పుల ఊబి లో కూరుకుపోతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. ఎరువుల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నా యూరియా అందక రైతు ల కష్టాలు అంతా ఇంతా కావని దినేష్ పటేల్ కులా చారి వాపోయారు. ము ఖ్యంగా, యూరియా పం పిణీ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న “యూరి యా యాప్” విధానంతో క్షేత్రస్థాయిలో రైతులకు ఎన్నో ఆటంకాలు ఎదుర వుతున్నాయన్నారు.

స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేని, అలాగే సాంకేతిక పరిజ్ఞానం తెలి యని నిరక్షరాస్య రైతులకు ఈ యాప్ ద్వారా యూరి యా పొందడం తలకు మిం చిన భారంగా మారిం దన్నారు.రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని సాం కేతిక ఇబ్బందులతో కూడిన ప్రస్తుత ‘యూ రియా యాప్’ విధానాన్ని వెంటనే నిలిపివేసి, పాత పద్ధతిలో రైతులకు నేరుగా ఎరువులు అందించాలనీ దినేష్ పటేల్ కులాచారి కోరారు. మండల స్థాయి వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్య టించి వాస్తవ పరిస్థితు లను పరిశీలించాలన్నారు ఎక్కడైతే యూరియా కొర త ఉందో ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించి, తక్షణమే ఎరువుల సర ఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.అన్నదాతల ఆవేదనను అర్థం చేసుకుని వెంటనే స్పం దించి నిజామాబాద్ జిల్లా లో యూరియా కొరతను తీర్చి, రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి కోరారు.

Leave a Reply