ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న వైద్య శిబిరం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న వైద్య శిబిరం
ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్య శిబిరాన్ని డి.ఎం. అండ్ హెచ్ ఓ సమత, మండల వైద్యాధికారి వినీత్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆద్వర్యం లో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా 99 రోజుల ఆరోగ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.
మార్చి 6 న ప్రారంభమైన కార్యక్రమం జూన్ 12 వరకు కొనసాగుతుందని, ప్రణాళిక లో భాగంగా ఈ రోజు ఎడపల్లి పి. హెచ్. సి లో కార్యక్రమం నిర్వహించామని అన్నారు.


