Vikas Nagar | దేవాలయ నిర్మాణానికి కానిస్టేబుల్ దంపతుల చేయూత..

Vikas Nagar | దేవాలయ నిర్మాణానికి కానిస్టేబుల్ దంపతుల చేయూత..
Vikas Nagar, హన్మకొండ, ఆంధ్రప్రభ : హన్మకొండ వికాస్ నగర్లో నిర్మాణంలో కొనసాగుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి శుక్రవారం కానిస్టేబుల్ మస్సి కుమార్, ఆయన సతీమణి మమత రూ.10,000లను విరాళం గా అందజేశారు. దేవాలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న ఈ సందర్భంలో భక్తుల సహకారం కూడా ఎంతో అవసరమని ముందు కొచ్చారు. ఈ నేపథ్యంలో మస్సి కుమార్ మమత దంపతులు తమ వంతు బాధ్యతగా ఆర్థిక సహాయం అందించారు.
గతంలో క్రీడా కారులకు ప్రోత్సాహంగా సహాయం అందించిన ఈ దంపతులు, నేడు ఆధ్యాత్మిక సేవలో భాగస్వాములు కావడం సంతోషకరం. క్రీడలకు చేయూత నిచ్చి యువతను ప్రోత్సహించడం… ఇప్పుడు దేవాలయ నిర్మాణానికి అండగా నిలవడం… వీరి సేవాభావాన్ని కనబరుస్తుంది. సమాజంలోని ప్రతి మంచి కార్యక్రమానికి ముందుండి సహకరించడం ద్వారా మస్సి కుమార్, మమత దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు అభిప్రాయపడ్డారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
