Munugode | గొలుసు దొంగల అరెస్ట్.. రిమాండ్..

Munugode | గొలుసు దొంగల అరెస్ట్.. రిమాండ్..

Munugode, ఆంధ్రప్రభ : ఈ నెల 15న నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని పలివెల గ్రామంలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ మెడలోని నల్లపూసల గొలుసును దొంగలించిన ఘటనకు సంబంధించిన కేసులో ఇద్దరు నిందితులను మునుగోడు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులకు సంబంధించిన వివరాలను డీఎస్సీ కె శివరామిరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 15న మండలంలోని పలివెల గ్రామం వెంకటరమణ ఫంక్షన్ హాల్ సమీపంలో చింతపండు తెంపుతున్న వృద్ధ మహిళ మెడలో ఉన్న బంగారు నల్లపూసల గొలుసును ఇద్దరు వ్యక్తులు దొంగలించి పరారయ్యారు. ఘటన పై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.

మునుగోడు శివారులోని కార్తికేయ కాటన్ మిల్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో టీఎస్ 07 జి ఎఫ్ 1819 నంబర్ గల టాటా టియోగో కారులో అనుమానస్పదంగా ప్రయాణిస్తున్న మాద నరేందర్ గౌడ్ (23), వల్లపు సాయికుమార్ (29)లను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 17.5 గ్రాముల బంగారు నల్లపూసల గొలుసు, కారును స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. స్వాధీనం చేసిన ఆస్తి విలువ సుమారు రూ. 2.45 లక్షలు ఉంటుందని తెలిపారు. చండూరు సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ఇరుగు రవి, కానిస్టేబుల్స్ పట్ల నరసింహ, కావలి నరసింహ, బాలాజీ, హరితేజ, సిబ్బంది చాక్యచక్యంగా పని చేసి నిందితులను పట్టుకున్నారని, ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు.

Leave a Reply