నిలిచిన మురికి తొలగింపు..

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ ; విద్యానగర్ పోచమ్మ ఆలయం వద్ద నిలిచిన మురికి తొలగించారు. మున్సిపల్ రెండో వార్డు కౌన్సిలర్ పర్శ కుశలత అనంత్ రావు క్లీన్ చేయించారు. మురికి కాలువలు లేక పోవడంతో నీరు నిలిచి మురికి పేరుకు పోతుందని వార్డు ప్రజలు పిర్యాదు చేయడం జరిగింది. వారి పిర్యాదు మేరకు గురువారం సమస్య పరిష్కారం కొరకు మున్సిపల్ సిబ్బంది ద్వారా మురికి తొలగింపజేశారు. మురికి నిలిచి వాటర్ నిలువ కుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని కౌన్సిలర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్ సున్నపు ఓంకార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply