Krishna district | ఎంఎస్ఎంఈల బలోపేతానికి ముందడుగు…

Krishna district | ఎంఎస్ఎంఈల బలోపేతానికి ముందడుగు…

  • రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ – ఏపీ చాంబర్స్ మధ్య అవగాహన ఒప్పందం…
  • స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలకు మార్గనిర్దేశం…
  • మార్కెట్, పెట్టుబడుల సంయుక్త కార్యాచరణ…

Krishna district | విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) స్టార్టప్‌ల ప్రోత్సాహానికి కీలక ముందడుగు పడింది. విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ – ఏపీ చాంబర్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ హాజరై, ఒప్పందం ద్వారా జిల్లాలో పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. ఆర్‌టీఐహెచ్ విజయవాడ సీఈవో జి. కృష్ణన్, ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు సమక్షంలో ఎంఓయూ పత్రాలు పరస్పరం మార్పిడి చేసుకున్నారు.

ఈ ఒప్పందం కింద స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలకు ఇన్క్యూబేషన్ (ఆలోచనల అభివృద్ధి), మెంటార్షిప్ (మార్గనిర్దేశం), మార్కెట్ ప్రాప్తి, పెట్టుబడిదారుల అనుసంధానం, వనరుల భాగస్వామ్యం, అవగాహన కార్యక్రమాలు, అవుట్‌రీచ్ కార్యక్రమాలు, సరఫరాదారులతో అనుసంధానం వంటి అంశాల్లో ఇరువురు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.

Krishna district |

ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ శ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రతిపాదించిన “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” దృష్టిని అమలు చేయడంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. జిల్లాలో యువతను పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సహించి, ఉద్యోగ సృష్టి లక్ష్యంగా ఈ ఒప్పందం ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply