ఏపీ పీజీసెట్‌లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభా ప్రభంజనం

ఏపీ పీజీసెట్‌లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభా ప్రభంజనం
పాయకాపురం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పీజీసెట్-2026 ఫలితాల్లో ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విశేష ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా పైపుల రోడ్డు ప్రాంతంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో శనివారం అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలల అకడమిక్ డైరెక్టర్ డా. బి.ఈ.వి.ఎల్. నాయుడు మాట్లాడుతూ, గణితశాస్త్ర విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడమే కాకుండా వివిధ సబ్జెక్టుల్లో టాప్-10లో ఎనిమిది ర్యాంకులు సాధించి విద్యార్థులు ప్రతిభ చాటారని తెలిపారు.
గణితశాస్త్ర విభాగంలో కాళ్లకూరి నరేంద్ర శర్మ రాష్ట్ర ప్రథమ ర్యాంక్, బాల ఫణీంద్ర కుమారి ద్వితీయ ర్యాంక్, కె. జ్యోతిక మరియు డి. అమృత సాయి వల్లి నాలుగో ర్యాంక్, ఎం. నాగదుర్గ ఆరో ర్యాంక్, కె. మహాలక్ష్మి ఏడో ర్యాంక్, ఎస్. భవాని ఎనిమిదో ర్యాంక్ సాధించారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన సి. గీత నందిని ఎనిమిదో ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.
అలాగే 11 నుంచి 100 ర్యాంకుల మధ్య గణితశాస్త్ర విభాగంలో 17, కంప్యూటర్ సైన్స్‌లో 21, స్టాటిస్టిక్స్‌లో 6, కెమిస్ట్రీలో 4, ఇంగ్లీష్‌లో 3, లైఫ్ సైన్స్‌లో 2, కామర్స్ విభాగంలో 3 ర్యాంకులను ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సాధించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డా. ఎన్. శేషారెడ్డి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారికి శిక్షణ అందించిన అధ్యాపకులను అభినందించారు. పీజీసెట్-2026లో విశిష్ట ఫలితాలు సాధించిన విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ డా. బి.ఈ.వి.ఎల్. నాయుడు, విద్యాసంస్థల కార్యదర్శి డా. ఎన్. సుగుణారెడ్డి, కళాశాలల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు అభినందించారు.
