Brs | మళ్ళీ కారే రావాలి.. కెసిఆర్ సారే రావాలి..

Brs | మళ్ళీ కారే రావాలి.. కెసిఆర్ సారే రావాలి..
ఘనంగా బిఆర్ ఎస్ అధినేత కేసిఆర్ జన్మదిన వేడుకలు
టపాసులు పేల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బిఆర్ఎస్ నేతలు
Brs | స్టేషన్ ఘన్ పూర్,ఆంధ్రప్రభ: మళ్ళీ కారే రావాలి.. కెసిఆర్ సారే రావాలి అంటూ ప్రజలందరూ కోరుకుంటున్నారని బిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.మంగళవారం మండలంలోని కోమటి గూడెంలో బిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలోఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహిం చారు. ఈ సందర్బంగా నాయకులు టపాసులు పేల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ..తెలంగాణ సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మహానేత అని కొని యాడారు. రాష్ట్ర హక్కుల కోసం, రైతు సంక్షేమం కోసం, నీటి వనరుల సాధన కోసం కేసీఆర్ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నా రు. పేదలు,రైతులు,బీసీలు, దళితుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు బోయిని కుమార్, పనికర పరుశరాములు, లక్ష్మి నర్సింహా, లింగనబోయిన శేఖర్, పరుశరాజు కుమార్, చిట్యాల సురేష్, బోయిని రాములు, శంకర్, సమ్మయ్య, ఆంజనేయులు, నర్సింహులు, కృష్ణ, వెంకన్న, రాజు, రాకేష్, యాదగిరి, నరేష్, సుధాకర్, గణేష్ తది తరులు పాల్గొన్నారు.
