వనపర్తి అభివృద్ధికి కలిసికట్టుగా ముందడుగు

వనపర్తి అభివృద్ధికి కలిసికట్టుగా ముందడుగు
వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : మంగళవారం వనపర్తి మున్సిపల్ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన ఎస్ ఎన్ ఎల్ మాధవి రమేష్ను జర్నలిస్ట్ నాయకులు గంగవరం రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వనపర్తి పట్టణ అభివృద్ధి ఇక వేగం పుంజుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. గత కొంతకాలంగా మందగించిన పురపాలన కార్యక్రమాలకు నూతన దిశ, దృఢ సంకల్పం అవసరమని పేర్కొన్నారు.
పారిశుధ్యం, తాగునీరు, రహదారుల మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ వంటి ప్రాథమిక అంశాల్లో తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ వనపర్తిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. అభివృద్ధి లక్ష్యాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, ప్రజా ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేద్దామని తెలిపారు.
