కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శం….

బిక్కనూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మండలంలోని కాచాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అబ్బ బాలకిషన్ అన్నారు. మంగళవారం గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. అట్టి పథకాలు ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ సిద్దా గౌడ్, బిఆర్ఎస్ మండల యూత్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, గ్రామ బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు భాగ్య, నాయకులు శివ నందం గౌడ్, మురళి, రాజిరెడ్డి, జీవన్ రెడ్డి, ఆకుతోట రాములు, మల్లారెడ్డి, కందునూరు శ్రీనివాస్, దేవయ్య, లోహిత రావు, సంగేపు మల్లేశం, ఉ డెం మల్లారెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
