ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

ఊర్కొండ, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ద్యాప వీరారెడ్డి ఆధ్వర్యంలో మండల బిఆర్ఎస్ నాయకులు మండలకేంద్రంలో జాతీయ రహదారి పై కేకు కట్ చేసి టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరము స్వీట్స్,పండ్లు పంచారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ తన పాలనలో రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రైతు బంధు, రైతు భీమా వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించారన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసి రైతుల అభివృద్ధికి కృషి చేశారని వారి సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు ,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
