యూరియా కోసం ధర్నా

యూరియా కోసం ధర్నా

మోస్రా (చందూర్), ఫిబ్రవరి16 (ఆంధ్రప్రభ): మోస్రా మండలం గోవూర్ గ్రామంలో యూరియా కోసం రైతులు రోడ్ ఎక్కిన పరిస్థితి ఏర్పడింది. యూరియా యాప్ సర్వర్ సమస్యలు, సరిపడ యూరియా అందుబాటులో లేకపోవడం, నిరక్షరాస్యులు అయిన రైతులు, స్మార్ట్ ఫోన్ లేక యూరియా బుకింగ్ ఎలా చేయాలో తెలియకపోవడం, కొంతమంది పెద్ద పెద్ద రైతులు మోతాదుకు మించి యూరియా బుక్ చేసుకుని నిల్వ ఉంచుకోవడం, యూరియా బుక్ చేసుకోవడానికి ఓక యూనియన్ గా మారి నిమిషాల వ్యవధిలో బుక్ చేయడం, సంబంధిత సిబ్బంది వారికి అనుకూలమైన రైతులకు యూరియాని సరఫరా చేయడంలో సహాయపడడం కూడా యూరియా దొరకపోవడానికి అసలు సమస్యగా తెలుస్తోంది.

దీంతో రైతులు గోవురు గ్రామంలో బాన్సువాడ నిజాంబాద్ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇకనైనా యూరియాను సరైన పద్ధతిలో రైతులకు ఇబ్బందులు లేకుండా, ఎక్కడి ప్రాంత రైతులకు అక్కడే యూరియాను సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు.

Leave a Reply