10th Ward | చైర్మన్ పీఠం ఎవరికి దక్కేనో…?

10th Ward | చైర్మన్ పీఠం ఎవరికి దక్కేనో…?

10th Ward | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : ఇంతకాలం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన భీమ్ గల్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగియడంతో ఇప్పుడు చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందో నాన్న ఉత్కంఠకు తెరలేసింది. చైర్మన్ పీఠం బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆరవ వార్డు కౌన్సిలర్ గా విజయం సాధించిన భీంగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోదిరే స్వామి సతీమణి నాగమణి చైర్మన్ రైస్ లో ముందు వరుసలో ఉన్నారు.

మండల పార్టీ అధ్యక్షుడిగా కష్టకాలంలోనూ పార్టీని నమ్ముకుని ఉండడంతో పాటు వివాదరహితుడిగా పేరు ఉండడంతో ఈసారి చైర్మన్ పీఠం బోదిరే నాగమణికి దక్కడం ఖాయమని చర్చ నడుస్తోంది. కాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు నాగేంద్ర సతీమణి ఆరెపల్లి శ్రీజ సైతం చైర్మన్ రేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదివరకే గెలిచిన కౌన్సిలర్లు అందరూ క్యాంపులో ఉన్నందున 16వ తేదీ అధిష్టానం ఎంపిక చేసిన వ్యక్తికి కౌన్సిలర్లు అంతా మద్దతు ఇవ్వాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్ నేతృత్వంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా వైస్ చైర్మన్ గా దళిత సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుండి రెండో వార్డు కౌన్సిలర్ గా విజయం సాధించిన పర్శ కుశలత ( అనంత్ రావు ), 10వ వార్డు కౌన్సిలర్ గా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య భార్య సంటి లత పోటీలో ఉన్నట్టు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన 8 వార్డు ల్లో ఎస్టీ సామాజిక వర్గం నుండి ఒక్కరు, బీసీ సామాజిక వర్గం నుండి నలుగురు ( మైనారిటీ ) కలుపుకుని, ఎస్టీ విభాగం నుండి ఒక్కరు ఉన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి అందరూ ఉండాలని పార్టీ సరైన సమయంలో ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేస్తుందని అధిష్టానం పెద్దలు కౌన్సిలర్లను బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. చైర్మన్ వైస్ చైర్మన్ గా ఎవరు ఎంపిక అవుతారు అన్న చర్చలు, అంచనాలు భీంగల్ మండల వ్యాప్తంగా కొనసాగుతుండగా, ఈనెల 16వ తేదీన ఈ ఉత్కంఠ కు తెరపడనుంది.

Leave a Reply