అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ-ప్రైమరీ విద్యను అమలు చేయాలి..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ప్రీ-ప్రైమరీ విద్యను పాఠశాలల్లో కాకుండా అంగన్వాడీ కేంద్రాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆద్వర్యంలో కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ నరేష్, ఏంఈవో ఆంధ్రయ్య లకు గురువారం వారి కార్యాలయాలలో అంగన్వాడీ టీచర్స్ వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీంగల్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఎం. యమున,మండల అధ్యక్షురాలు పి. మంజుల రాణి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు.

అంగన్వాడీల ద్వారా అందుతున్న సేవలను పక్కన పెట్టి ప్రీ-ప్రైమరీ విద్యను పాఠశాల విద్యలో కలపడం వల్ల ఐసిడిఎస్ కు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.అంగన్వాడి కేంద్రాల పరిరక్షణతో పాటు, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రీ-ప్రైమరీ విద్యను అంగన్వాడికి కేంద్రాల్లోని కొనసాగించాలని, మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు కనీస వేతనం రూ.18,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలన్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని అన్నారు.15వేల కాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలి. అంగన్వాడీ టీచర్స్ కు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని,తమ న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ లక్ష్మి,సునంద తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply