ward9 | రికార్డు మెజారిటీ…

ward9 | రికార్డు మెజారిటీ…
-కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ రాజు ఘన విజయం
స్టేషన్ ఘన్ పూర్ ఫిబ్రవరి13 ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డు నెంబర్ 9 ఫలితం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం 18 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఇదే వార్డు అత్యధిక మెజారిటీని నమోదు చేయడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌధరపల్లి సంపత్ రాజు స్పష్టమైన ఆధిక్యంతో ప్రత్య ర్థులను దూరం పెట్టి ఘన విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచే సంపత్ రాజు ఆధిక్యం కనబరుస్తూ ముందంజలో కొనసాగారు. చివరికి ఆయన 755 ఓట్లు సాధించి, సమీప ప్రత్యర్థి కనకం గణేష్ (బిఆర్ఎస్) పై 579 ఓట్ల భారీ మెజారిటీతో గెలు పొందారు. కనకం గణేష్‌కు 176 ఓట్లు లభించాయి. ఇతర అభ్యర్థుల్లో భాస్కుల రాజేందర్ (బీజేపీ) 12, ఇందు శ్రావణి (బీఎస్పీ) 7, ఆకుల నర్సింగం 12, భాస్కుల యాదగిరి 8, భాస్కుల నాగరాజు (డీఎస్పీ) 8 ఓట్లు సాధించారు. చెల్లని ఓట్లు 7 ఉండగా, నోటా ఒకటి నమోదైంది.
వార్డు 9లో నమోదైన ఈ భారీ మెజారిటీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేక రికార్డుగా నిలిచింది. పట్టణ ఓటర్లు స్పష్టమైన తీర్పుతో సంపత్ రాజుపై నమ్మకం ఉంచినట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ఫలి తాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా వార్డు 9 విజయంతో పార్టీ ఉత్సాహం రెట్టింపు అయింది. అనంతరం విజయా నికి కృషి చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య కు సంపత్ రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
