Narsampet సమస్యలు ఎదురైతే నా దృష్టికి తీసుకురండి: డీసీపీ అంకిత్
Narsampet సమస్యలు ఎదురైతే నా దృష్టికి తీసుకురండి: డీసీపీ అంకిత్
- ఇటుకాలపల్లి గ్రామ సభలో అనూహ్యంగా హాజరైన డీసీపీ
నర్సంపేట క్రైం (Narsampet) , ఆంధ్రప్రభ:
గ్రామాల్లో శాంతి భద్రతల సమస్యలు పరిష్కారమైతే సమాజంలో క్రమక్రమంగా సానుకూల ప్రభావం కనిపిస్తుందని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ అన్నారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభకు ఆయన అనూహ్యంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఏర్పడే శాంతి భద్రతల సమస్యలు, సైబర్ మోసాలు తదితర అంశాలను తన దృష్టికి తీసుకురావచ్చని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. పౌర భద్రతను కాపాడటం ప్రతి పోలీస్ బాధ్యత అని తెలిపారు.
ఎస్సై అరుణ్, సీఐ శ్రీనివాస్ ప్రజలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన భద్రతా నియమాలు, నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనదారులు ఇంటి నుంచి బయలుదేరిన వారు సురక్షితంగా తిరిగి ఇంటికి చేరాలని సూచిస్తూ “అరైవ్ అలైవ్” సందేశాన్ని వివరించారు.
అనంతరం జరిగిన గ్రామ సభలో సర్పంచ్ మెరుగు సుమలత శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మార్వో రవిచంద్రారెడ్డి సహా వివిధ శాఖల అధికారులు గ్రామస్తులతో చర్చించారు.
గ్రామ అభివృద్ధికి సంబంధించిన సూచనలు, సలహాలను ప్రజల నుంచి స్వీకరించి వాటిని ప్రణాళికలో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
