Court | సీఎంఎం కోర్టుకు దేవినేని ఉమా…

Court | సీఎంఎం కోర్టుకు దేవినేని ఉమా…
- రెండు కేసుల విచారణలో హాజరు
Court | విజయవాడ, ఆంధ్రప్రభ : వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన రెండు వేర్వేరు కేసుల విచారణ నిమిత్తం టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) కోర్టుకు పార్టీ నాయకులతో కలిసి హాజరయ్యారు.
విజయవాడ రూరల్ మండలంలోని జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా అప్పటి ప్రభుత్వం నమోదు చేసిన కేసుతో పాటు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై నమోదైన కేసులో భాగంగా విచారణకు హాజరయ్యారు.
