15వ వార్డులో ‘చింతల వసంత’ ప్రభంజనం..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన 15వ వార్డు కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత ఘన విజయం సాధించి, కౌన్సిల్‌లో అడుగుపెట్టారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ ఓటరు దేవుడు వసంత వైపే మొగ్గు చూపారు.

హోరాహోరీ పోరులో ‘వసంత’ మెరుపులు
15వ వార్డులో మొదటి నుంచి త్రిముఖ పోటీ నెలకొన్నప్పటికీ, చివరకి ఓటర్లు కాంగ్రెస్ వైపే నిలిచారు. చింతల వసంతకు అత్యధికంగా 435 ఓట్లు పోలవ్వగా, తన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి ఆరెపల్లి లావణ్యకు 340 ఓట్లు వచ్చాయి. దీంతో వసంత 95 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రధాన పార్టీ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి మాధవి 189 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా, నోటా కు 10 ఓట్లు, ఏఐఎఫ్ బీ అభ్యర్థి సరితకు 7 ఓట్లు పోలయ్యాయి.

వార్డు అభివృద్ధి నా లక్ష్యం
విజయం ఖాయం కావడంతో 15వ వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా విజేత చింతల వసంత మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డులోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

Leave a Reply