బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
కడెం, (ఆంధ్రప్రభ): కడెం మండలంలోని సారంగాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన రెండు విషాద ఘటనల బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
గ్రామానికి చెందిన సందు రాజేశ్వర్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా, మరో గ్రామస్థురాలు మార్కపు రాజవ్వ కూడా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కడెం మాజీ ఎంపీపీ బి. అమ్మి బాపూరావు బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సారంగాపూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ కోల లావణ్య, నరేష్, నాయకులు మేకల రాజేశ్వర్, పుప్పాల దశరథ్, కోల నరసయ్య, బోనగిరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
