Association | నూతన చట్టాలను రద్దు చేయాలని ర్యాలీ…

Association | నూతన చట్టాలను రద్దు చేయాలని ర్యాలీ…
Association | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉరవకొండ పట్టణంలో సిఐటియు, ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైఖ్య ఈ సమ్మెకు మద్దతు ప్రకటించి అనుబంధ సంఘాలన్నీ సంఘీభావం తెలిపాయి.
కరిబసప్ప స్వామి గవి మఠం వద్ద నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీఎన్జీ వోస్ అసోసియేష న్ నాయకులు మాట్లాడుతూ నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలి, వేతన సవరణ, పిఎఫ్ ఆర్డిఏ చట్టం రద్దు, పెండింగ్ బకాయిలు చెల్లింపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియమితీకరణ, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ అమలు చేయాలన్నారు.
అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మధుసూదన్ నాయుడు, రంగారెడ్డి, సీనప్ప, ఉద్యోగ సంఘం నాయకులు భాస్కర్ బాబు, గురు ప్రసాద్, ధన శేఖర్, అరుణమ్మ, ప్రసాద్, అశ్వత్వ నారాయణ, పర్తప్ప, విజయ్ కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
