Elections | ఈసీ ఆదేశాలతో…

Elections | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల్లో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని సంగారెడ్డి పీఎస్‌లో ఎఫ్‌టీఎస్‌ టీమ్‌ ఫిర్యాదు చేసింది. అయితే ఈసీ ఆదేశాలతో జగ్గారెడ్డిపై 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాంగ్రెస్ నేతను కొట్టినందుకే సీఐను తిట్టాల్సి వచ్చిందని జగ్గారెడ్డి తెలిపారు. సీఐ శివకుమార్‌ బీఆర్‌ఎస్ అభ్యర్థికి సహకరించారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చర్యలు ఉండాలని జగ్గారెడ్డి చెప్పారు.

Leave a Reply