Police | దాడి చేసిన తోటి విద్యార్థుల అరెస్ట్

Police | దాడి చేసిన తోటి విద్యార్థుల అరెస్ట్
Police | గుంటూరు, ఆంధ్రప్రభ : విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ విద్యార్థి దాడి ఘటనపై చేబ్రోలు పోలీసులు వేగం పెంచారు..జిల్లా ఎస్పీ వకుల్ జిందా ఆదేశాల మేరకు.. చేబ్రోలు ఎస్ హెచ్ ఓ పి.వీరనారాయణ, ఎస్ఐ వి.ఈశ్వరరావు తమ బృందంతో కలసి ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తులు.. దాడి ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో విస్తృతంగా సర్కులేట్ కాకముందే చేబ్రోలు పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడికి సంబంధించి విద్యార్థి తండ్రి అరమందల అరుణ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ తరలించారు. దాడి చేసిన యువకులపై ఈ సెక్షన్ ను ఉపయోగించి కేసు నమోదు చేసారు. Cr. No. 28/2026 U/s 109(1), R/w 3(5) BNS… ఈ ఘటంలో ఏడుగురుపై కేసులు నమోదు చేసినట్లు చేబ్రోలు పోలీసులు వెల్లడి చేసారు.
ముద్దాయిల వివరాలు..
- దారా పరిమళ్ రిహాన్ @ లక్కీ
- వెలిశెట్టి ఆదర్శ్ బాబు
- వాకా సోమ శేఖర్ @ సోము
- రాపోలు తిరుపతిరావు
- నందం బాల కోటేశ్వరావు
- త్రోవగుంట బాల సాయిరామ్
- కొత్తా సాయి అమర్ నాధ్
