CPI Narayana | సంచలన వ్యాఖ్యలు..

CPI Narayana | సంచలన వ్యాఖ్యలు..
CPI Narayana, తిరుమల, ఆంధ్రప్రభ : తిరుపతి లడ్డు వివాదం పై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి. కల్తీ జరిగిన మాట వాస్తవమే.. ఆ దోషులని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన అధికారులను, పాత ఈవోను వదిలేయకూడదు.. రాజకీయ లబ్ధి కోసమే అధికార, ప్రతిపక్ష పార్టీలు లడ్డు పై రాద్ధాంతం చేస్తున్నాయి.. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదు అన్నారు.
మీ రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తులను మనోవేదనకు గురి చేయొద్దు.. సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.. ఈ సమయంలో రాజకీయ నేతలు లడ్డు పై మాట్లాడటం ఆపేయాలి. మీ మీ రాజకీయాల కోసం కావాలంటే కొట్టుకోండి.. కానీ దేవుడిని మాత్రం లాగొద్దు. లడ్డు వివాదం పై అనవసర చర్చలు ఆపి, భక్తుల మనోభావాలను కాపాడండి అన్నారు.

